పిల్లి సుభాష్ చంద్రబోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిల్లి సుభాష్ చంద్రబోస్

ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 జూన్ 2019
ముందు కె.ఈ.కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ

రెవెన్యూ,రిజిస్ట్రేషన్, స్టాంపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 జూన్ 2019
ముందు కె.ఈ.కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
June 2019
ముందు యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీ

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
భారత జాతీయ కాంగ్రెస్ (2013 కి ముందు)
వృత్తి రాజకీయ నాయకుడు

పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత రాజకీయ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి . అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. అతను రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. [1]

జీవిత విశేషాలు[మార్చు]

పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 8, 1950న తూర్పుగోదావరి జిల్లా హసన్‌బాద్‌లో జన్మించాడు. 1970లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై మంత్రిపదవికి రాజీనామా చేశాడు. డిసెంబరు 2011లో తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ మార్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాసతీర్మానంలో కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి అనుకూలంగా ఓటుచేయడంతో శాసనసభ్యత్వాన్ని కోల్పోయాడు.

వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెండుసార్లు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో ఒకసారి ఆయన మంత్రిగా ఉన్నాడు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రామచంద్రపురం నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కె. రోశయ్య కేబినెట్ కేబినెట్ లో మంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీలో చేరారు. [2]

2019 లో, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోని ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఒకరుగా ఉన్నాడు. అతనికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రి బాధ్యతలు కూడా ఇచ్చారు. [3] [4]

మూలాలు[మార్చు]

  1. My Neta
  2. Andhra Pradesh Know Your Minister: Pilli Subhash Chandrabose
  3. Andhra Pradesh Ministers: Portfolios and profiles
  4. Jagan Reddy appoints Dalit woman as home minister of Andhra Pradesh