కన్నా లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నా లక్ష్మీనారాయణ

వ్యవసాయ మంత్రి [1]
పదవీ కాలం
2012 ఫిబ్రవరి 1 – 2014 ఫిబ్రవరి 27

వ్యక్తిగత వివరాలు

జననం (1955-08-13) 1955 ఆగస్టు 13 (వయసు 67)
నగరంపాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ janasena party
నివాసం బంజారా హిల్స్, హైదరాబాదు.
మతం హిందూ
వెబ్‌సైటు http://www.kannalakshminarayana.com

కన్నా లక్ష్మీనారాయణ భారతదేశ రాజకీయనాయకుడు, గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు [2] అతడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, వ్యవసాయ సాంకేతిక మిషన్ విభాగానికి కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.[3]

ప్రారంభ జీవితం[మార్చు]

కన్నా లక్ష్మీనారాయణ 1955 ఆగస్టు 13న గుంటూరు జిల్లా లోని నగరంపాలెంలో రాఘవయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించాడు. వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభను కనబరచేవాడు. పిన్నవయసులోనే రాజకీయాలపై ప్రభావితుడైనాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

కన్నా లక్ష్మీనారాయణ 2009లో గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదవసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతడు 1989 నుండి 2004 వరకు నాలుగు సార్లు అతిపెద్ద నియోజవర్గమైన పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2014 అక్టోబరు 27న న్యూఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

నిర్వహించిన పదవులు[మార్చు]

 • 1991-1994 : నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాలలో క్రింది విభాగాలలో స్టేట్ మినిస్టరుగా బాధ్యతలు చేపట్టాడు.
  • a) క్రీడలు & యువజన సర్వీసులు
  • b) సహకార రంగం
  • కార్మిక, ఉపాధి, శిక్షణ
 • 2004-2009 : వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో సహకారం, రవాణా [6] విభాగాలలో కేబినెట్ మంత్రిగా కొనసాగాడు.
 • 2009 మే : వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో భారీపరిశ్రమలు, కామర్స్, ఆహార ఎగుమతుల శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.
 • 2009 సెప్టెంబరు : కొణిజేటి రోశయ్య మంత్రి వర్గంలో భారీపరిశ్రమలు, కామర్స్, ఆహార ఎగుమతుల శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.
 • 2010 డిసెంబరు : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.
 • 2012 ఫిబ్రవరి : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత మిషన్ శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.[7][8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతడి భార్య కన్నా విజయలక్ష్మి. వారికి ఇద్దరు కుమారులు. కుమారులు కన్నా నాగరాజు గుంటూరు కార్పొరేషన్ కు మేయర్ గా, కన్నా ఫణీంద్ర వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]