వర్ల కుమార్ రాజా
వర్ల కుమార్ రాజా | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | కైలే అనిల్ కుమార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పామర్రు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గాంధీ నగర్, పామర్రు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1978 డిసెంబరు 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | వర్ల రామయ్య | ||
జీవిత భాగస్వామి | విశ్రమ (యుగి ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్) | ||
సంతానం | అలాన జ్యూయెల్, రాయస్ యుగంధర్ | ||
నివాసం | డోర్ నెం: 21-31, గాంధీ నగర్, పామర్రు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వర్ల కుమార్ రాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పామర్రు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఇతను సీనియర్ తెలుగుదేశం నేత వర్ల రామయ్య కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]వర్ల కుమార్ రాజా తన తండ్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి తండ్రి రామయ్యకు సహకారం అందిస్తూ 2021 అక్టోబరులో టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమితుడై నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తూ, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆయన 2024 ఎన్నికల ముందు 40 రోజులపాటు నిర్వరామంగా నిర్వహించిన 'పల్లె బాట - పల్లె నిద్ర కార్యక్రమం ఆయనకు ఎంతో ఉపయోగపడింది.
వర్ల కుమార్ రాజా 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ పై 29690 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pamarru". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.