వనమాడి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనమాడి వెంకటేశ్వరరావు
వనమాడి వెంకటేశ్వరరావు


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
తరువాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
నియోజకవర్గం కాకినాడ పట్టణ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వనమాడి లోవరాజు
జీవిత భాగస్వామి శ్రీదేవి

వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వనమాడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు పై 4506 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ చేతిలో 33446 ఓట్ల తేడాతో, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 18641 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. వనమాడి వెంకటేశ్వరరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై 24,259 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో 14111 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.