Jump to content

మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు

వికీపీడియా నుండి
మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు
మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు


ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌
పదవీ కాలం
2022 నవంబర్ 23 - ప్రస్తుతం

నియోజకవర్గం కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-08-31) 1962 ఆగస్టు 31 (వయసు 62)
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి మమత
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం కాకినాడ

మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 1962 ఆగష్టు 31 న జన్మించాడు. 14వ లోక్‌సభ సభ్యుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసుపార్టీ తరపున లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేశాడు.పళ్ళంరాజు తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కూడా గతంలో మూడుమార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసాడు. మంగపాటి పళ్ళం రాజు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం పార్లమెంటరీ నియోజక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున 15 వ లోక్ సభకు పాతినిధ్యం వహించాడు.[1] ఆయన 2022 నవంబరు 23న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[2][3]

బాల్యం

[మార్చు]

ఎం.ఎం.పళ్లంరాజు 1962 ఆగస్టు 31 న డా.ఎం.ఎస్. సంజీవి రావు, రామ రాజేశ్వరి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. పళ్ళంరాజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఇ., ఎం.బి.ఎ విద్యను, అమెరికాలోని ఫిలడెల్పియా విద్యాభాసం చేశారు.[4] వీరికి శ్రీమతి మమతతో 1989 ఫిబ్రవరి 15 న వివాహము జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

పళ్ళం రాజుగారు 1989-91 తొమ్మిదవ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1995 నుండి 2000 వరజ్య్ ఆధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగాను, 1997 నుండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుని గాను పనిచేశారు. 2004 లో జరిగిన ఎన్నికలలో రెండవ సారి కూడా లోక్ సభ స్థానానికి ఫోటీ చేసి గెలుపొందారు. 2006 జనవరి నుండి 2009 మే వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసాడు. 2009 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మూడో సారి కూడా అదే నియోజిక వర్గంలో గెలుపొంది రక్షణ శాఖ మంత్రిగా వుండి 2012 అక్టోబరు 28 నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా కొనసాగుతున్నారు.

అభిరుచులు

[మార్చు]

వీరికి, సంగీతము, ఫోటోగ్రఫి, పుట్ బాల్, ఈత, గుర్రపు స్వారి, మొదలగునవి ఇష్టమైన విషయాలు.

వరించిన గౌరవాలు

[మార్చు]

జవహర్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం 2006 లో వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha". web.archive.org. 2013-10-04. Archived from the original on 2013-10-04. Retrieved 2021-05-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Zee News Telugu (23 November 2022). "ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన, కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
  3. A. B. P. Desam (23 November 2022). "ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్‌లో భారీ మార్పులు". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
  4. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.

బయటి లింకులు

[మార్చు]