మల్లిపూడి శ్రీరామ సంజీవరావు
ఎంఎస్ సంజీవరావు | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ | |
In office 1971–1984 | |
అంతకు ముందు వారు | మొసలికంటి తిరుమలరావు |
తరువాత వారు | తోట గోపాలకృష్ణ |
నియోజకవర్గం | కాకినాడ , ఆంధ్రప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | భీముని పట్నం, విశాఖపట్నం జిల్లా , ఆంధ్రప్రదేశ్ భారత దేశం , | 1929 ఆగస్టు 3
మరణం | 2014 సెప్టెంబరు 3[1] కాకినాడ | (వయసు 85)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంతానం | 2, మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు |
మల్లిపూడి శ్రీరామ సంజీవరావు (1929 –2014) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, లోక్‌సభ సభ్యుడు. ఆంధ్ర ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ ప్రముఖ నాయకుడు. భారతదేశపు మొదటి ఎలక్ట్రానిక్స్ కమిషన్‌కు ఛైర్మన్‌గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు. సంజీవరావును "భారతదేశం ఎలక్ట్రానిక్స్ పితామహుడు" అని పిలుస్తారు.[2] సంజీవరావు కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[3][4][5][6]
జీవితం తొలి దశలో
[మార్చు]సంజీవరావు 1929లో కాపు కుటుంబంలో జన్మించారు [7] సంజీవరావు, 1929, ఆగష్టు 3న విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నంలో జన్మించారు. ఇతని స్వస్థలం, తూర్పు గోదావరి జిల్లా లోని బాలాంతరం గ్రామం. సంజీవరావు తండ్రి, మల్లిపూడి పల్లంరాజు, భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు, భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సభ్యుడు. తండ్రి రాజకీయ వారసత్వం అంది పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన సంజీవరావు తన సత్తా చాటుకున్నాడు. సంజీవరావు ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ చదివాడు.[8]
సంజీవరావు ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడం తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత సంజీవరావు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో చేరారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో, ఆపై హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ ఎలక్ట్రానిక్స్ లాబొరేటరీలో సంజీవరావు పనిచేశాడు.[8]
రాజకీయ జీవితం
[మార్చు]తండ్రి మరణం తర్వాత సంజీవరావు రావు రాజకీయాల్లోకి వచ్చారు. 1970లో జరిగిన రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టాడు. వెనువెంటనే 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, 2,92,300 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. ఇది ఆ ఎన్నికల్లో దేశంలోనే రెండవ అత్యంత మెజారిటీ. 1977లో, ఆ తర్వాత 1980లో తిరిగి కాకినాడ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[9] 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కేంద్రం మంత్రిగా పని చేశారు.[8] 1984లో మరలా కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసినా, తెలుగుదేశం ప్రభంజనంలో, తోట గోపాలకృష్ణ చేతిలో ఓడిపోయాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సంజీవరావుకు మల్లి పూడి మంగపతి పల్లంరాజుతో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు పక్షవాతంతో చక్రాల కుర్చీకై పరిమతమై, 2014, సెప్టెంబరు 3న గుండెపోటుతో మరణించారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "President of India condoles the passing away of Dr. M.S. Sanjeevi Rao". Business Standard. 4 September 2014. Retrieved 6 January 2021.
- ↑ Dey, Soumik (31 March 2018). "A tribute to MS Sanjeevi Rao, India's father of electronics". The Week (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
- ↑ Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1984. p. 101. Retrieved 28 December 2017.
- ↑ 4.0 4.1 Agarala Easwara Reddi; D. Sundar Ram (1994). State Politics in India: Reflections on Andhra Pradesh. M.D. Publications Pvt. Ltd. pp. 338–. ISBN 978-81-85880-51-8. Retrieved 28 December 2017.
- ↑ Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1984. p. 7. Retrieved 1 February 2019.
- ↑ Economic and Political Weekly. Sameeksha Trust. 1984. pp. 585–586. Retrieved 1 February 2019.
- ↑ Sankar, K. N. Murali (2019-03-26). "Battle equally poised in port town Kakinada". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-08.
- ↑ 8.0 8.1 8.2 Dey, Soumik (31 March 2018). "A tribute to MS Sanjeevi Rao, India's father of electronics". The Week (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
- ↑ 9.0 9.1 "అభివృద్ధిపై చెరగని ముద్ర". సాక్షి. No. 4 సెప్టెంబరు 2014. 4 September 2014. Retrieved 2 August 2024.
- CS1 Indian English-language sources (en-in)
- 1929 జననాలు
- 2014 మరణాలు
- ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- భారత ప్రభుత్వ మంత్రులు
- ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- విశాఖపట్నం జిల్లా వ్యక్తులు
- విశాఖపట్నం జిల్లా రాజకీయ నాయకులు
- తూర్పు గోదావరి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- 5వ లోక్‌సభ సభ్యులు
- 6వ లోక్‌సభ సభ్యులు
- 7వ లోక్‌సభ సభ్యులు