Jump to content

వేగేశన నరేంద్ర వర్మ రాజు

వికీపీడియా నుండి
వేగేశన నరేంద్ర వర్మ రాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కోన రఘుపతి
నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం 1969
పిట్టలవానిపాలెం, పిట్టలవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వేగేశన కృష్ణం రాజు
జీవిత భాగస్వామి హరి కుమారి
నివాసం గాయత్రి నిలయం, విజయలక్ష్మి పురం, 22వ వార్డు, బాపట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బాపట్ల నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికయ్యాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలం, పిట్టలవానిపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన 1985లో పదవ తరగతి పూర్తి చేశాడు. నరేంద్ర వర్మ రాజు ఆ తరువాత మందుల దుకాణంలో రెండేళ్లు సేల్స్ బాయ్‌గా పనిచేసి ఆ తరువాత దుకాణాన్ని లీజుకు తీసుకుని వ్యాపారిగా మారాడు. ఆయన ఆ తర్వాత ఆక్వా రైతుగా, స్థిరాస్తి వ్యాపారిగా, రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ లు స్థాపించి పారిశ్రామికవేత్తగా ఎదిగాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వేగేశన నరేంద్ర వర్మ రాజు 2016లో టీడీపీ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బాపట్ల నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి కోన రఘుపతిపై 27768 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (9 May 2024). "Bapatla: Know your candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Prajasakti (4 June 2024). "నరేంద్రవర్మకు పట్టం కట్టిన బాపట్ల ప్రజలు". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  4. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Bapatla". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. Prajasakti (21 June 2024). "తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నరేంద్ర వర్మ". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.