Jump to content

పిట్టలవానిపాలెం మండలం

Coordinates: 15°58′52″N 80°38′06″E / 15.981°N 80.635°E / 15.981; 80.635
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°58′52″N 80°38′06″E / 15.981°N 80.635°E / 15.981; 80.635
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంపిట్టలవానిపాలెం
విస్తీర్ణం
 • మొత్తం
75 కి.మీ2 (29 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
38,609
 • సాంద్రత510/కి.మీ2 (1,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014


పిట్టలవానిపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా లోని 100% గ్రామీణ మండలాల్లో ఒకటి. పిట్టలవానిపాలెం, ఈ మండలానికి కేంద్రం.[3] ఇది సమీప పట్టణమైన పొన్నూరు నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన మండలం, ఇక్కడ కృష్ణ డెల్టా కాలువలు వ్యవసాయానికి నీటిని అందిస్తాయి.

జనాభా గణాంకాలు

[మార్చు]
పిట్టలవానిపాలెం మండలంలో మతాలు (2011)[4]
మతం శాతం
హిందూ
  
79.35%
ఇస్లాం
  
16.75%
క్రైస్తవ
  
2.55%
ఇతర
  
1.35%

పిట్టలవానిపాలెం మండలలో వాడుక భాషలు (2011)

  తెలుగు (83.50%)
  ఉర్దూ (16.30%)
  ఇతర (0.20%)

2011 జనాభా లెక్కల ప్రకారం, మండలంలో 10,992 గృహాలలో 38,609 మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభాలో 19,175 మంది పురుషులు, 19,434 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల 3,536 మంది పిల్లలు ఉన్నారు, వీరిలో 1,857 మంది బాలురు, 1,679 మంది బాలికలు ఉన్నారు. 2001 - 2011 దశాబ్దంలో మండల జనాభా తగ్గింది. జిల్లాలో జనాభా పెరుగుదల 9.47% ఉండగా, మండలంలో జనాభా తగ్గుదల 0.73% ఉంది. సగటు అక్షరాస్యత రేటు 23,711 మంది అక్షరాస్యులతో 67.60% వద్ద ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జనాభాలో వరుసగా 6,450, 1,900 ఉన్నారు.[5]

2011 జనాభా లెక్కల సమయంలో, జనాభాలో 83.50% మందికి తెలుగు, 16.30% మందికి ఉర్దూ మొదటి భాషగా ఉంది.[6]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అల్లూరు
  2. కోమలి
  3. ఖాజీపాలెం
  4. చందోలు
  5. పిట్టలవానిపాలెం
  6. సంగుపాలెం కోడూరు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Bapatla district - Mandals". Retrieved 2 June 2023.
  4. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  5. "District Census Hand Book – Guntur" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
  6. "Table C-16 Population by Mother Tongue: Andhra Pradesh". Census of India. Registrar General and Census Commissioner of India.