కొత్తపాలెం (పిట్టలవానిపాలెం)
కొత్తపాలెం బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′N 80°36′E / 15.9°N 80.6°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | పిట్టలవానిపాలెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522311 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామములో అందరిదీ రెక్కాడితేగానీ డొక్కడని పరిస్థితి. చాలా కుటుంబాలలో మద్యానికి బానిసలైన వారున్నారు. ఈ పరిస్థితులలో, 15 ఏళ్ళక్రితం ఏర్పడిన స్వయం సహాయక బృందాలు, మహిళలలో చైతన్యం తెచ్చినవి. సంఘసభ్యులంతా ఏకతాటిపై నిలిచి గ్రామంలో మద్యం అమ్మరాదనీ, మద్యం త్రాగి ఎవరూ గ్రామములోనికి రారాదనీ, అలా వచ్చినవారితో ఎవరూ మాట్లాడరాదనీ, తీర్మానించుకున్నారు. దీనితో చాలామంది, మగవారు మద్యానికి దూరమైనారు. అలా మారిన మగవారు కూలీ పనులతోపాటు, కొంత భూమిని కౌలుకు తీసికొని, వ్యవసాయం చేయసాగినారు. ఇప్పుడు వీరంతా ఆర్థికంగా నిలదొక్కుకుని, బాగుపడ్డారు. ఎన్నికల సమయంలో గూడా ఈ గ్రామస్థులు మద్యం జోలికి పోరు. గ్రామాన్ని రు. 3 కోట్లతో అభివృద్ధి చేసుకున్నారు. ఈ చైతన్యానికి కారణం మద్యనిషేధమే.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వల్లూరి పార్వతి, 62 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా గెలుపొందినారు.