Jump to content

మంతెనవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 15°59′13″N 80°39′04″E / 15.986807°N 80.651096°E / 15.986807; 80.651096
వికీపీడియా నుండి
మంతెనవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మంతెనవారిపాలెం is located in Andhra Pradesh
మంతెనవారిపాలెం
మంతెనవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°59′13″N 80°39′04″E / 15.986807°N 80.651096°E / 15.986807; 80.651096
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం పిట్టలవానిపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522329
ఎస్.టి.డి కోడ్ 08643

మంతెనవారిపాలెం, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పిన్ కోడ్ నం.522 329., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతంలో స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపించింది ఈ గ్రామమే. ఒకే గ్రామం నుండి ఎక్కువమంది స్వాతంత్ర్యకాంక్షతో దేశమాత విముక్తికి పోరాడిన ఘనత ఈ వూరికే దక్కుతుంది. 1938లో గాంధీగారు ఇక్కడ రాజకీయ పాఠశాలను ప్రారంభించారు.స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ మంతెన వెంకటరాజు ఆధ్వర్యంలో, దళితులకు దేవాలయ ప్రవేశం, వితంతు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు.మహాత్ముడు పలుమార్లు ఈ గ్రామాన్ని దర్శించారు[1].

గ్రామం పేరువెనుక చరిత్ర

[మార్చు]

పూర్వము దీనిని రాచసిరిపూడి అని పిలిచేవారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

బాపట్ల నుండి 20 కి.మీ. దూరంలోను, తెనాలి నుండి 30 కి.మీ. దూరంలో మండల కేంద్రం పిట్టలవానిపాలెం నుండి 2కి.మీ. దూరంలో, మంతెనవారిపాలెం ఉంది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]
  • శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం.
  • శ్రీ వీరభక్త హనుమాన్ ఆలయం:- రు. 40 లక్షల గ్రామస్థుల, దాతల ఆర్థిక సహకారంతో నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలమధ్య, వైభవంగా నిర్వహించారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

గ్రామానికి చెందిన శ్రీ బోరుగడ్డ ప్రదీప్, "బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్"కు ఎంపికైనారు. ఈయన తన 11వ ఏట, ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్నారు. తరువాత ఈయన తన ఆత్మవిశ్వాసంతో, ఒంటికాలుతో, 300 నృత్యప్రదర్శనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలంలోని, ర్యాలి గ్రామంలో, అబ్రకదబ్ర కళావేదికపై, 2014, ఫిబ్రవరి-2న, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ ప్రతినిధి శ్రీ చింతా శ్యాంకుమార్, వీరికి సన్మానం చేసి, ప్రశంసా పత్రం అందజేశారు.

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. ఈనాడు గుంటూరు రూరల్ జులై 12, 2013. 8వ పేజీ