కప్పలవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కప్పలవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కప్పలవారిపాలెం is located in Andhra Pradesh
కప్పలవారిపాలెం
కప్పలవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°58′23″N 80°36′22″E / 15.973181°N 80.606239°E / 15.973181; 80.606239
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం పిట్టలవానిపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522329
ఎస్.టి.డి కోడ్ 08643

కప్పలవారిపాలెం బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం. 522 329., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం ఖాజీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన శ్రీ కప్పల శ్రీనివాసరావు, వసంత దంపతులు, తమకు ఉన్న కొద్దిపాటి పొలం సాగుచేసుకుంటూ, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమార్తె కళ్యాణి, ఖాజీపాలెంలోని కె.వి.ఆర్., కె.వి.ఆర్., ఎం.కె.ఆర్. డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యనభ్యసించుచున్నది. ఈమె చదువుతోపాటు, క్రీడలలొనూ రాణించుచున్నది. అలుపెరుగని పరుగుతో, జిల్లా, రాష్ట్రస్థాయి పరుగు పందేలలో తన సత్తా చాటి, పరుగులరాణిగా గుర్తింపుపొందినది. పాఠశాలస్థాయిలో ప్రారంభమైన ఆమె పరుగు, ఇప్పుడు జాతీయస్థాయికి చేరినది.
  • ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, ఫణీంద్రమ్మ ఒక పేద కుటుంబనికి చెందినవారు. వెంకటేశ్వరరెడ్డి కాలంచేయగా, ఫణీంద్రమ్మ కూలిపనులు చేసుకుంటూ తన కుమార్తె వరలక్ష్మిని కష్టపడి చదివించుచున్నది. వరలక్ష్మి ప్రస్తుతం ఖాజీపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నది. ఈమె చిన్నతనం నుండి, చదువుతోపాటు క్రీడలలో గూడా రాణించుచూ పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించుచున్నది.

మూలాలు[మార్చు]