పిట్టువారిపాలెం (పిట్టలవానిపాలెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిట్టువారిపాలెం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలుపులు 2015,జూన్-14 నుండి 17 వరకు, నిర్వహించెదరు. ఈ ఆలయంలో 17వ తేదీ బుధవారంనాడు, బండ్లమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాలను గ్రామములోని ప్రధానవీధులలో ఊరేగించారు. యువకులు కేరింతలుకొడుతూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ దేవత అంకమ్మ తల్లి కొలుపులలో భాగంగా, నాలుగవరోజున బండ్లమ్మ తల్లి కొలుపులు, ఐదవరోజున మారెమ్మ తల్లి కొలుపులు, నిర్వహించడం ఇక్కడ ఆచారంగా వస్తున్నది.