జె.వి.నరసింగరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జె.వి.నరసింగరావు భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క 1956 పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపు నుంచి సంతకం చేసిన వారిలో ఒకరు. ఇతను 1972లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇతను 1967, 1972లలో జరిగిన రెండు వరుస ఎన్నికల్లో లక్సిట్టిపేట్ నుండి ఎంఎల్ఎగా గెలిచారు, తను రెండవసారి గెలిచినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జె.వి.నరసింగరావు పూర్తిపేరు జోగినపల్లి వెంకట నరసింగరావు. ఇతని పెద్ద కుమారుడు నృపేందర్‌రావు పెన్నార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, యజమాని.[1][2]

ఇవి కూడా చూడండి[మార్చు]

  • పెద్దమనుషుల ఒప్పందం - 1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి చేసుకున్న ఒప్పందం.

మూలాలు[మార్చు]