Jump to content

బెందాళం అశోక్

వికీపీడియా నుండి
బెందాళం అశోక్
బెందాళం అశోక్

బెందాళం అశోక్


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2014 - ప్రస్తుతం
ముందు పిరియా సాయిరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-08-10) 1982 ఆగస్టు 10 (వయసు: 43)
రామయ్య పుట్టుగ, కవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు జ్యోతీబాల
ప్రకాష్ రావు
జీవిత భాగస్వామి బెందాళం నిలోత్ఫల
నివాసం రామయ్య పుట్టుగ, కవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి డెంటల్ కాలేజీ, ఏలూరు
వృత్తి బి.డి.యస్ -దంతవైద్యులు
మతం హిందూ

బెందాళం అశోక్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతను ఇచ్చాపురం నియోజికవర్గానికి టిడిపి ఇన్ చార్జ్‌గా వ్యవహరించారు. ఆయనను 2024 ఎన్నికల్లో 2024 ఫిబ్రవరి 24న ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1982 ఆగస్టు 10న శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలానికి చెందిన రామయ్య పుట్టుగ గ్రామంలో ప్రకాష్ రావు, జ్యోతీబాల దంపతులకు జన్మించాడు.[2] ఏలూరులోని డెంటల్ కళాశాలలో బి.డి.ఎస్. చదివాడు. వైద్యవృత్తిని ప్రక్కకు పెట్టి ప్రజా సేవకు నడుంభిగించాడు.[3] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసిన అతను 86.815 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఎన్.రామారావుపై 25000లకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు.[4] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిరయా సాయిరాజ్ పై విజయం సాధించాడు.[5]

బెందాళం అశోక్ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై, నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (24 February 2024). "టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!". the original నుండి 24 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 February 2024.
  2. "Ashok Bendalam MLA of ICHCHAPURAM Andhra Pradesh contact address & email". nocorruption.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-06-09.
  3. "అందరి మన్ననలు అందుకుంటోన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే డా|| బెందాళం.అశోక్".[permanent dead link]
  4. "ఇచ్ఛాపురం టి.డి.పి ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?". the original నుండి 2017-09-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-06-09.
  5. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. the original నుండి 2019-05-29 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-07-21.
  6. Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". the original నుండి 13 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2024.
  7. Andhrajyothy (12 November 2024). "'విప్‌'గా బెందాళం అశోక్‌..." the original నుండి 13 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2024.

బయటి లంకెలు

[మార్చు]