కింజరాపు అచ్చెన్నాయుడు

వికీపీడియా నుండి
(కింజరాపు అచ్చంనాయుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కింజరాపు అచ్చంనాయుడు
కింజరాపు అచ్చెన్నాయుడు

కింజరాపు అచ్చంనాయుడు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
టెక్కలి శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
8 జూన్ 2014 - ప్రస్తుతం
ముందు కొర్ల రేవతీపతి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలము
1996 – 2009
ముందు మజ్జి నారాయణరావు
తరువాత పిరియా సాయిరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-03-26) 1971 మార్చి 26 (వయస్సు: 48  సంవత్సరాలు)
టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు దాలినాయుడు (తండ్రి)
జీవిత భాగస్వామి విజయమాధవి
బంధువులు కింజరాపు ఎర్రన్నాయుడు (సోదరుడు)
రామ్మోహన్‌ నాయుడు (సోదరుని కుమారుడు)
సంతానము కృష్ణ మోహన్‌ నాయుడు , తనూజ
నివాసము నిమ్మాడ గ్రామం శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి కృష్ణా కళాశాల, విశాఖపట్నం
వృత్తి రాజకీయము , వ్యవసాయము
మతం హిందూ

కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు. ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వున్నాడు.[1] ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన మార్చి 26 1971టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. ఆయన కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రంనాయుడు. అచ్చంనాయుడు హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మూడుసార్లు ఎం.ఎల్.ఎగా ఎన్నికైనారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి మారారు. ఆయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రేవతీపతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతీపతి ఆకశ్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన మరల రేవతీపతి భార్య అయిన కె.భారతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.[2] 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గల ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క పాతపట్నం శాసన సభ నియోజకవర్గం తప్ప అన్నింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలుపుటకు కృషిచేసిన అచ్చన్నాయుడును రాష్ట్ర కేబినెట్ లో కార్మిక శాఖను అప్పగించారు.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]