కింజరాపు ఎర్రన్నాయుడు
కింజరాపు ఎర్రన్నాయుడు[1] | |||
![]() కింజరాపు ఎర్రన్నాయుడు | |||
భారత పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1996-98, 1998-99, 1999-2004, 2004-2009 | |||
ముందు | విశ్వనాధం కణితి | ||
---|---|---|---|
తరువాత | కిల్లి కృపారాణి | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నిమ్మాడ, ఆంధ్ర ప్రదేశ్ | 1957 ఫిబ్రవరి 23||
మరణం | 2012 నవంబరు 2 రణస్థలం | (వయసు 55)||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | కింజరాపు విజయ కుమారి | ||
సంతానం | 1 కూతురు , 1 కొడుకు | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందు | ||
సెప్టెంబరు 16, 2006నాటికి |
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
బాల్యం , విద్యాభ్యాసం[మార్చు]
ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం గారలో సాగించి, టెక్కలిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ విశాఖపట్టణంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు.
రాజకీయ జీవితం[మార్చు]
ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన కింజరాపు కృష్ణమూర్తి ఇతడి చిన్నాన్న. అతను శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999, 2004) లోక్ సభ సభ్యునిగా భారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
కుటుంబం[మార్చు]
ఇతడి భార్య విజయకుమారి. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రథమ ఉద్దేశంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు. ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన నాయుడు 2014 లోక్ సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి గెలుపొందారు.
మరణం[మార్చు]
నవంబర్ 2, 2012 న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా ఇతడు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు మరణాన్ని ధ్రువీకరించారు .
మూలం[మార్చు]
బయటి లింకులు[మార్చు]

- Official biographical sketch in Parliament of India website
- ఈనాడు ఆదివారం పత్రికలో 2008 ఫిబ్రవరి 3న ప్రచురించబడిన ఇంటర్వ్యూ ఆధారంగా
- Commons category link is on Wikidata
- 1957 జననాలు
- 11వ లోక్‌సభ సభ్యులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 13వ లోక్‌సభ సభ్యులు
- 14వ లోక్‌సభ సభ్యులు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- 2012 మరణాలు
- రోడ్డు ప్రమాదంలో మరణించినవారు
- శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రులు