విశ్వాసరాయి కళావతి
విశ్వాసరాయి కళావతి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 నుండి ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1967 వండవ గ్రామం, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మండంగి హరిప్రసాద్ | ||
సంతానం | మండంగి సాయివైష్ణవి | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
విశ్వాసరాయి కళావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]విశ్వాసరాయి కళావతి 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం జిల్లా , వీరఘట్టం మండలం , వండవ గ్రామం లో జన్మించింది. ఆమె తండ్రి విశ్వాసరాయి నరసింహరావుదొర ఒకసారి ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆమెఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ సోషియాలజీ పూర్తి చేసింది.[2] ఆమె కొంతకాలం పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, తగరపు వలస శాఖ డిప్యూటీ మేనేజర్‌గా పని చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]విశ్వాసరాయి కళావతి 2009లో ప్రజారాజ్యం పార్టీ చేరి ఆ పార్టీ తరపున పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యింది.ఆమె తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకష్ణపై 1652 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది.ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకష్ణపై 17980ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "Palakonda Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 8 July 2021. Retrieved 8 July 2021.
- ↑ Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ The Financial Express (23 May 2019). "Andhra Pradesh Assembly election result: Full list of winners". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ Andhrajyothy (24 May 2019). "పాలకొండ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, రికార్డు సృష్టించిన కళావతి". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.