విశ్వాసరాయి నరసింహరావుదొర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వాసరాయి నరసింహరావుదొర

మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ

ఎంపీ
పదవీ కాలం
1967 - 1972
నియోజకవర్గం పార్వతీపురం పార్లమెంట్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1924
వండవ గ్రామం, వీరఘట్టం మండలం శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 19 ఆగస్ట్ 2019
శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం , వండవ గ్రామం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ
జీవిత భాగస్వామి శాంతికుమారి, అన్నపూర్ణమ్మ
సంతానం ఐదుగురు కుమార్తెలు, కుమారుడు (విశ్వాసరాయి కళావతి)
వృత్తి రాజకీయ నాయకుడు

విశ్వాసరాయి నరసింహరావుదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ఆయన ఒకసారి ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆయన సర్దార్ గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాములు నాయుడుకు రాజకీయ గురువు.

జననం[మార్చు]

విశ్వాసరాయి నరసింహరావుదొర 1924లో ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి వద్ద సియోలీలో అప్పన్నదొర, రత్నాలమ్మ దంపతులకు జన్మించాడు.ఆయనకు శాంతికుమారి, అన్నపూర్ణమ్మ ఇద్దరు భార్యలు, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. చివరి కుమార్తె శాంతికుమారి పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంది.

రాజకీయ జీవితం[మార్చు]

విశ్వాసరాయి నరసింహరావుదొర 1956లో వండవ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశాడు. ఆయన 1967లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్వతీపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. నరసింహరావుదొర 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాడు.ఆయన 1978లో జనతా పార్టీ నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా, 1985లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన తరువాత గిరిజన కార్పొరేషన్ చైర్మన్‌గా, డీసీసీబీ చైర్మన్‌గా, పీఏసీఎస్‌కు 30 ఏళ్లు అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించాడు. ఆయన వృద్ధాప్యం కారణంగా 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు దూరమయ్యాడు.

మరణం[మార్చు]

విశ్వాసరాయి నరసింహరావుదొర 19 ఆగస్ట్ 2019లో శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం వండవ గ్రామంలోని తన స్వగృహంలో మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. The Hans India (19 August 2019). "Ex MP Narasimha Rao Dora passes away in Veeragattam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Sakshi (20 August 2019). "పేదల దొర ఇక లేరు." Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Andrabhommi (20 August 2019). "రాజకీయ కురువృద్ధుడు వండువదొర అస్తమయం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". Retrieved 7 July 2021. {{cite news}}: Check |archiveurl= value (help)