Jump to content

కందుల దుర్గేష్

వికీపీడియా నుండి
కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్
కందుల దుర్గేష్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు జి.శ్రీనివాస నాయుడు
నియోజకవర్గం నిడదవోలు

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2007 - 2013

వ్యక్తిగత వివరాలు

జననం 1974
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ

కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నిడదవోలు నుండి జనసేన పార్టీ నుండి పోటీ చేయనున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కందుల దుర్గేష్ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివదిహ హోదాల్లో పనిచేసి నుండి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు.[2] ఆయన ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2014లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 21,243 ఓట్లు సాధించాడు. ఆయన ఆ తరువాత 2016 డిసెంబరు 12న వైఎస్సార్‌సీపీలో చేరాడు.[3][4]

కందుల దుర్గేష్ 2018 ఆగస్టు 30న జనసేనలో చేరి[5] 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 42,685 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.[6]

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్‌ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా నిడదవోలు నుంచి జనసేన - టిడిపి - బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అతడి పేరును జనసేన పార్టీ ప్రకటించింది.[7] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడుపై 33304 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై జూన్ 12న పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (12 March 2024). "నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్‌". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  2. I & PR (2007). "MLCs ELECTED FROM ASSEMBLY CONSTITUENCY" (PDF). Archived from the original (PDF) on 12 March 2024. Retrieved 12 March 2024.
  3. Sakshi (9 December 2016). "12న వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నా: దుర్గేష్‌". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  4. Sakshi (13 December 2016). "వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ". Archived from the original on 12 March 2024.
  5. "జనసేనలో చేరిన కందుల దుర్గేష్, పంతం నానాజీ". 30 August 2018. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  6. Andhrajyothy (11 March 2024). "టీడీపీ 5..జనసేన 2". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  7. ETV Bharat News (11 March 2024). "నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  8. EENADU (13 June 2024). "తొలిసారి ఎమ్మెల్యే.. ఆపై అమాత్య యోగం". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  9. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.