ధర్మాన కృష్ణదాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మాన కృష్ణదాస్
ధర్మాన కృష్ణదాస్


పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు

వ్యక్తిగత వివరాలు

తల్లిదండ్రులు రామలింగంనాయుడు (తండ్రి)
సావిత్రమ్మ (తల్లి)
బంధువులు ధర్మాన ప్రసాదరావు (సోదరుడు)
నివాసం శ్రీకాకుళం జిల్లా
మతం హిందూ


ధర్మానన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు[3][4]

జీవిత విశేషాలు[మార్చు]

ధర్మాన కృష్ణదాస్ బీ.కాం వరకు చదివాడు. అతని సోదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా, మంత్రిగా కూడా పనిచేసాడు. 2003 వరకు కృష్ణదాస్ అతని సోదరుని విజయం కొరకు తెరవెనుక కృషిచేసాడు. 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో అతను ఉద్యోగం వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2004[5], 2009[6] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నరసన్నపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత అతను వై.ఎస్.జగన్మోహనరెడ్డి కి అండగా ఉన్నాడు. అతని సోదరుడు ప్రసాదరావు కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగినా, తాను మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2012 ఉప ఎన్నికలో సోదరుడు ధర్మాన రామదాస్ పై గెలుపొందాడు.[7] 2014[8]లో ఓడినా, జగన్మోహనరెడ్డికి విధేయుడిగా ఉన్నాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నాలుగోసారి శాసనసభ్యునిగా విజయం సాధించాడు.[9] ఈ ఎన్నికలలో ధర్మాన ప్రసాదరావు కూడా విజయం సాధించినప్పటికీ అతనిని కాదని జగన్మీహనరెడ్డి కృష్ణదాస్ కు మంత్రి పదవి కట్టబెట్టాడు[10][11].

ములాలు[మార్చు]

 1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 3. Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 4. Andhra Jyothy (8 June 2019). "ధర్మాన కృష్ణదాస్‌." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 5. "Andhra Pradesh Assembly Election Results in 2004". www.elections.in. Retrieved 2019-07-21.[permanent dead link]
 6. "Andhra Pradesh Assembly Election Results in 2009". www.elections.in. Retrieved 2019-07-21.[permanent dead link]
 7. "Narasannapeta Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Narasannapeta, Andhra Pradesh". www.elections.in. Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
 8. "Andhra Pradesh Assembly Election Results 2014 Live Updates and News". www.elections.in. Retrieved 2019-07-21.
 9. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.
 10. "ధర్మాన కృష్ణదాస్‌." www.andhrajyothy.com. 2019-06-08. Retrieved 2019-07-21.[permanent dead link]
 11. admin (2019-06-08). "ఏపీ మంత్రిగా ధర్మాన‌ కృష్ణదాస్ ప్ర‌మాణ స్వీకారం". Janahitam (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.