Jump to content

ముప్పిడి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
ముప్పిడి వెంకటేశ్వరరావు
ముప్పిడి వెంకటేశ్వరరావు


ఎమ్మెల్యే
పదవీ కాలం
2024 - ప్రస్తుతం
ముందు తానేటి వ‌నిత
నియోజకవర్గం కొవ్వూరు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2019
ముందు తానేటి వ‌నిత
తరువాత తలారి వెంకట్రావు
నియోజకవర్గం గోపాలపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకయ్య
జీవిత భాగస్వామి సుజాత
పూర్వ విద్యార్థి నాగార్జున యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

ముప్పిడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ముప్పిడి వెంకటేశ్వరరావు 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిన్నాయగూడెం గ్రామంలో జన్మించాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు చేతిలో ఓడిపోయాడు.

వెంకటేశ్వరరావు 2024లో కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై 33,946 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (18 March 2019). "గోపాలపురం మే 'కుల' కుర్చీ". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  3. Prajasakti (4 June 2024). "కూటమి విజయ దుందుభి". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.