ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్)
సంక్షిప్తీకరణINC(R)
స్థాపకులుఇందిరా గాంధీ
స్థాపన తేదీ12 నవంబరు 1969 (1969-11-12)
రద్దైన తేదీ1970లో
విభజనINC
Succeeded byINC
రాజకీయ విధానంసెక్యులరిజం[1]
జవహర్‌లాల్ నెహ్రూ విజన్ పాలసీ విధానాలు[2]
ఆర్థిక జాతీయవాదం[3]
Pro-సోవియట్ sentiment[4]
రాజకీయ వర్ణపటంవామపక్ష రాజకీయాలు[5]
రంగు(లు)  Turquoise

భారత జాతీయ కాంగ్రెస్ (రెక్విజిషనిస్ట్స్) ఈ పార్టీ 1969లో స్థాపించబడింది, దీనిని ఇందిరా గాంధీ రూపొందించి, నాయకత్వం వహించారు. అప్పటి ఏకీకృత భారత జాతీయ కాంగ్రెస్ విడిపోయింది. అందులోనిమరొక భాగం భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్)గా మారింది.[6]

'ఆర్' అనే అక్షరం 'రిక్విజిషన్' ను సూచిస్తుంది.[7] అసలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) లేదా కాంగ్రెస్ (ఒ) గా మారింది. దీనికి కామరాజ్ నాయకత్వం వహించాడు. దీనిని అనధికారికంగా కాంగ్రెస్ లేదా సిండికేట్ అని పిలిచేవారు. పూర్వం నుండి వస్తున్న కాడిని మోస్తున్న ఒక జత ఎద్దుల పార్టీ గుర్తును నిలుపుకున్నారు. ఇందిరా గాంధీ నాయకత్వంలో విడిపోయిన వర్గానికి పార్టీ ఎన్నికల చిహ్నంగా భారత ఎన్నికల కమిషన్ పాలుత్రాగే దూడతో కూడిన ఆవుతో ఉన్న కొత్త చిహ్నాన్ని కేటాయించింది.[7]

1969లో సంయుక్త్ విధాయక్ దళ్ పతాకం కింద ఐక్య ప్రతిపక్షం హిందీ ప్రాంతంలోని అనేక రాష్ట్రాలపై నియంత్రణ సాధించినప్పుడు ఈ చీలిక సంభవించింది.ఆ సమయంలో పార్టీ నాయకత్వం చాలావరకు ఇందిరా గాంధీపై సవాలు చేసింది.ప్రజలలో తన మద్దతును ప్రదర్శించడానికి ఇందిరా గాంధీ కొత్త పార్టీని ఏర్పాటు చేసింది.1971 సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ (R) లోక్‌సభలోని 518 స్థానాలలో 352 స్థానాలను గెలుచుకొని భారీ మెజారిటీని సాధించింది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరిచింది. తరువాత 1970లలో కాంగ్రెస్ అనే పేరు ఇందిరా గాంధీ కోసం 'ఐ' తో కాంగ్రెస్ (ఐ) గా మారింది. క్రమంగా కాంగ్రెస్ (ఐ) భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) మారింది. కాంగ్రెస్ (ఓ) జనతా పార్టీలో విలీనం అయింది. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఉర్సు) ఇతర పార్టీలలో చేరాయి.[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. "Difference between old congress and new congress? | EduRev Humanities/Arts Question".
  2. "Difference between old congress and new congress? | EduRev Humanities/Arts Question".
  3. "Indira Gandhi nationalised 14 Indian banks on this day: Why she did do that and what was the outcome". Times Now. July 19, 2022.
  4. "1971 When Delhi and Moscow came together". 12 August 2021.
  5. "Difference between old congress and new congress? | EduRev Humanities/Arts Question".
  6. "History of Indian National Congress". IndiaNetzone.com. Retrieved 2024-06-27.
  7. 7.0 7.1 Sanghvi, Vijay (2006). The Congress, Indira to Sonia Gandh. New Delhi: Kalpaz Publications. p. 77. ISBN 81-7835-340-7.
  8. Andersen, Walter K..