పాముల పుష్ప శ్రీవాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాముల పుష్ప శ్రీవాణి
పాముల పుష్ప శ్రీవాణి


పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

గిరిజన సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలం
8 జూన్ 2019[3] – 2022 ఏప్రిల్ 10[2]
ముందు కిడారి శ్రావణ్ కుమార్

పదవీ కాలం
2014 – 2024
ముందు జనార్ధన తాట్రాజు
తరువాత తోయక జగదీశ్వరి

వ్యక్తిగత వివరాలు

జననం 22 జూన్ 1986
పశ్చిమ గోదావరి జిల్లా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ
తల్లిదండ్రులు పాములు నారాయణ మూర్తి
(తండ్రి ),
గౌరీ పార్వతి
(తల్లి )
జీవిత భాగస్వామి శత్రుచర్ల పరీక్షిత రాజు
నివాసం పోలవరం, పశ్చిమ గోదావరి
పూర్వ విద్యార్థి సూర్య డిగ్రీ కాలేజీ, జంగారెడ్డి గూడెం (2003-2008),
కె.ఆర్.ఎన్.వి కాలేజ్, విశాఖపట్నం (2008)
వృత్తి రాజకీయ నాయకురాలు

పాముల పుష్పశ్రీవాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈవిడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కురుపాం శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందింది.

జననం

[మార్చు]

పుష్ప శ్రీవాణి 1986, జూన్ 22న పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించింది. 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదివిన ఈవిడ, ఇంటర్ జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో, డిగ్రీ అక్కడి ఉమెన్స్ కళాశాలలో, విశాఖలో బీఈడీ పూర్తి చేసింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఏడాదిన్నరపాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి ఉపాధ్యాయ వృత్తిని వీడి భర్త ప్రోత్సాహంతో రాజకీయలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)లో కురుపాం శాసనసభా నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ థాట్రాజ్ పై 26, 602 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019, జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి దక్కింది.[5][6]

ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కురుపాం నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి నుండి తన సమీప టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి చేతిలో 23500 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[7]

మూలాలు

[మార్చు]
  1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. సాక్షి, పాలిటిక్స్ (22 June 2018). "వైఎస్సార్‌పై అభిమానంతోనే పరీక్షిత్‌తో పెళ్లి." Sakshi. Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.
  5. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్- రాజకీయ వార్తలు (8 June 2019). "పాముల పుష్పశ్రీవాణి." www.andhrajyothy.com. Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.
  6. బీబీసీ తెలుగు, శంకర్ (8 June 2019). "జగన్ క్యాబినెట్‌: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి". Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.
  7. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kurupam". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.