జనార్థన్ థాట్రాజ్
జనార్థనథ్రాట్ రాజ్ వీర వర తోడరమల (జనార్థన్ థాట్రాజ్) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ సభ్యుడు. అతను 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కురుపాం శాసనసభా నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతని తండ్రి సత్యప్రసాద్ థాట్రాజ్. అతను పార్వతీపురం ఎస్.వి.డి కళాశాల నుంచి బి.ఎ చేసాడు.
2009లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించాడు. అతను 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కురుపాం శాసనసభా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సమీప ప్రజా రాజ్యం పార్టీ కి చెందిన ప్రత్యర్థి నిమ్మక జయరాజుపై 15053 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. [1] రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీడీపీలో చేరాడు. అతను 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి చేతిలో ఓడిపోయాడు. [2] 2019లో ఎన్నికల్లో టీడీపీ తరుపున కురుపాంలో నామినేషన్ వేశాడు. అయితే కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. అతను నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు.
అతను సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజుకు మేనల్లుడు. [3]
2020 జూలై 21న విజయనగరంలోని తన నివాసంలో ఉదయం ఛాతినొప్పి రావడంతో భార్య ఈశ్వరి స్థానికంగా ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2020-07-23.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2014". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2020-07-23.
- ↑ Team, TV9 Telugu Web (2020-07-21). "ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత." TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-23.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ "ఏపీ : మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్ మృతి". ntnews. 2020-07-21. Archived from the original on 2020-07-23. Retrieved 2020-07-23.