తోయక జగదీశ్వరి
తోయక జగదీశ్వరి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | పాముల పుష్ప శ్రీవాణి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కురుపాం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొండవాడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1983 జూలై 8||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సన్యాసినాయుడు అడ్డాకుల | ||
సంతానం | అడ్డుకుల నేహిత | ||
నివాసం | 1-17, మెయిన్ స్ట్రీట్, తాడికొండ గ్రామం, గుమ్మలక్ష్మీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
తోయక జగదీశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కురుపాం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]తోయక జగదీశ్వరి రాజకీయ నేపధ్యమున్న కుటుంబ నుండి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006 నుండి 2011 వరకు తాడికొండ ఎంపీటీసీ సభ్యురాలిగా, 2012 నుండి 2014 వరకు మండల మహిళా అధ్యక్షురాలిగా, 2016 నుండి 18 వరకు కురుపాం వ్యవసాయశాఖ సభ్యురాలిగా, 2019 నుండి 21 వరకు గుమ్మలక్ష్మీ పురం తెదేపా ఎస్టీ సెల్ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పని చేసి 2021లో ఎల్విన్‌పేట ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచి, 2021లో అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైంది.[2]
తోయక జగదీశ్వరి 2022 జనవరిలో కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమితురాలైంది.[3] ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కురుపాం నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నుండి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి పై 23500 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (5 June 2024). "చరిత్ర తిరగరాసిన జగదీశ్వరి". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ TV9 Telugu (29 February 2024). "ఈ జిల్లాలో టీడీపీ సీనియర్స్‌ను కాదని యంగ్ లీడర్స్‌ను తెరపైకి.. వీరి గెలుపు ఖాయమా." Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (26 January 2022). "తెదేపా కురుపాం ఇన్‌ఛార్జిగా జగదీశ్వరి". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kurupam". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "కూటమి ప్రభంజనం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.