మిరియాల శిరీషా దేవి
స్వరూపం
మిరియాల శిరీషా దేవి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | నాగులపల్లి ధనలక్ష్మి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రంపచోడవరం (ఎస్టీ) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1994 అనంతగిరి, రాజవొమ్మంగి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | మఠం విజయ్ భాస్కర్ | ||
నివాసం | అనంతగిరి, రాజవొమ్మంగి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మిరియాల శిరీషా దేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రంపచోడవరంనియోజకవర్గం (ఎస్టీ) నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మిరియాల శిరీషా దేవి ఎనిమిదేళ్ల అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసి 2023 డిసెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త మఠం విజయ్ భాస్కర్ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి[2][3][4], 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రంపచోడవరంనియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఈ ఎన్నికలలో ఆమెకు 90,087 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు వచ్చాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rampachodavaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ Hindustantimes Telugu (15 March 2024). "రంపచోడవరం టీడీపీ అభ్యర్ధిగా అంగన్‌వాడీ టీచర్... ఎమ్మెల్సీ అనంతబాబే అసలు టార్గెట్". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ EENADU (15 March 2024). "బరిలోకి రేసు గుర్రాలు.. ఉమ్మడి జిల్లా నుంచి మరో నలుగురు". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ ABP Desham (29 March 2024). "ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.