మహమ్మద్ నజీర్ అహ్మద్
మహమ్మద్ నజీర్ అహ్మద్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | షేక్ మొహమ్మద్ ముస్తఫా | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుంటూరు తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైయస్ఆర్‌సీపీ | ||
తల్లిదండ్రులు | అబ్దుల్ మునాఫ్ | ||
జీవిత భాగస్వామి | ఫాతిమా | ||
సంతానం | నిహాల్, నామీర్, నాశిత | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు తూర్పు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తెలగుదేశం పార్టీ తరుపున ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]మహమ్మద్ నజీర్ అహ్మద్ 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 వరకు గుంటూరు తూర్పు నియోకజవర్గ సమన్యయకర్తగా ఉంటూ 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కలేదు, ఆయన 2019 వరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసి 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి షేక్ మొహమ్మద్ ముస్తఫా చేతిలో 22091 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
నజీర్ అహ్మద్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నూరి ఫాతిమా షేక్ పై 31962 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Guntur East". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.