దాట్ల సుబ్బరాజు
దాట్ల సుబ్బరాజు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ముమ్మిడివరం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014-2019 | |||
ముందు | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | ||
తరువాత | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | ||
నియోజకవర్గం | ముమ్మిడివరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 మురమల్ల గ్రామం, ఐ.పోలవరం మండలం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | వెంకట సత్యనారాయణ రాజు | ||
నివాసం | మురమల్ల గ్రామం, ఐ.పోలవరం మండలం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దాట్ల సుబ్బరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు[1][2]
రాజకీయ నాజీవితం
[మార్చు]దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 నుండి 2013 వరకు మురమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా పని చేసి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావుపై 29,538 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
దాట్ల సుబ్బరాజు 2019 శాసనససభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేతిలో 5,547 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 శాసనససభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌పై 38,736 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mummidivaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ Eenadu (13 November 2024). "శాసనసభ విప్‌లుగా ఎమ్మెల్యేలు దివ్య, బుచ్చిబాబు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.