Jump to content

కోలగట్ల వీరభద్రస్వామి

వికీపీడియా నుండి
కోలగట్ల వీరభద్రస్వామి
కోలగట్ల వీరభద్రస్వామి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 సెప్టెంబర్ 2022 - 4 జూన్ 2024
ముందు కోన రఘుపతి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - 4 జూన్ 2024
ముందు మీసాల గీత
తరువాత అదితి విజయలక్ష్మి
నియోజకవర్గం విజయనగరం

వ్యక్తిగత వివరాలు

జననం 28 మే 1961
విజయనగరం జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సన్యాశి రాజు, లక్ష్మి
జీవిత భాగస్వామి కె.వి.రమణి
సంతానం సంధ్య, శ్రావణి [1]
నివాసం విజయనగరం

కోలగట్ల వీరభద్రస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కోలగట్ల వీరభద్రస్వామి 1961లో విజయనగరంలో జన్మించాడు. ఆయన విజయనగరంలోని ఎం.ఆర్.కాలేజీలో బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కోలగట్ల వీరభద్రస్వామి 1983లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డెరైక్టర్‌గా, 1987లో విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్‌గా, 1988లో అర్బన్ బ్యాంకు అధ్యక్షునిగా పని చేశాడు. ఆయన 1989లో తొలిసారిగా విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. కోలగట్ల వీరభద్రస్వామి 1994,1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

కోలగట్ల వీరభద్రస్వామి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పూసపాటి అశోక్ గజపతి రాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత 2013లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2]ఆయన కాంగ్రెస్ పార్టీలో విజయనగరం పట్టణ అధ్యక్షునిగా, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశాడు.

కోలగట్ల వీరభద్రస్వామి 23 ఏప్రిల్ 2014న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.[3]ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయనగరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. వీరభద్రస్వామి 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4]ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (30 July 2021). "MLA's daughter elected as Vizianagaram Deputy Mayor". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  2. Ceo Telangana (2013). "Kolagatla Veerabhadra Swamy" (PDF). Archived (PDF) from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  3. Sakshi (23 April 2014). "ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  4. Sakshi (10 March 2015). "ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలగట్ల". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  5. Sakshi (6 June 2019). "ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.