Jump to content

బత్తుల బలరామకృష్ణ

వికీపీడియా నుండి
బత్తుల బలరామకృష్ణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 నుండి ప్రస్తుతం
ముందు జక్కంపూడి రాజా
నియోజకవర్గం రాజానగరం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
గదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు గంగారావు, గోవిందమ్మ
జీవిత భాగస్వామి వెంకట లక్ష్మి
సంతానం ప్రత్యూష దేవి, వందనంబిక

బత్తుల బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాజానగరం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం గాదరాడలో శక్తిపీఠం ద్వారా ప్రజలకు పరిచయమైన ఆయన ఆ తరువాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఆయన సతీమణి వెంకటలక్ష్మిని ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించుకొని అనతి కాలంలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆయన ఆ తరువాత జనసేన పార్టీలో చేరగా ఆయనను రాజానగరం నియోజకవర్గానికి ఇంచార్జిగా 16 జులై 2023న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించాడు.[2]

బలరామకృష్ణ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా పై 34,049 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. A. B. P. Desam (16 July 2023). "వేగం పెంచిన పవన్ కళ్యాణ్, 3 నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం - నిర్మాతకు కీలక పదవి". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rajanagaram". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  5. Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.