కోనేటి ఆదిమూలం
కోనేటి ఆదిమూలం | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 - ప్రస్తుతం | |||
ముందు | తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సత్యవేడు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 03 ఏప్రిల్ 1952 భీముని చెరువు గ్రామం, నారాయణవనం మండలం , చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కోనేటి ఎలుమలై, కాంతమ్మ [1] | ||
జీవిత భాగస్వామి | కె.గోవిందమ్మ | ||
సంతానం | 4 (కోనేటి సుమన్ కుమార్) | ||
పూర్వ విద్యార్థి | బీఏ |
కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కోనేటి ఆదిమూలం 03 ఏప్రిల్ 1952లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారాయణవనం మండలం, భీముని చెరువు గ్రామంలో కోనేటి ఎలుమలై, కాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుండి బీఏ వరకు చదువుకున్నాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]కోనేటి ఆదిమూలం 1977లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1981లో భీమునిచెరువు గ్రామ సర్పంచిగా పని చేశాడు. కోనేటి ఆదిమూలం 1988లో నారాయణవనం మండలం వైస్ ఎంపీపీగా, 1995లో ఎంపీటీసీగా పని చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2001లో టీడీపీలో చేరి జడ్పీటీసీగా ఎన్నికయ్యాడు.
కోనేటి ఆదిమూలం టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన సత్యవేడు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]
[6]2024 లో టి.డి.పి లో చేరారు.
మూలాలు
[మార్చు]- ↑ Hmtv (23 January 2020). "వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం." Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Eenadu (5 September 2024). "ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సస్పెండ్ చేసిన తెదేపా". Retrieved 5 September 2024.
- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Eenadu (11 June 2024). "అభ్యర్థులు సిద్ధం.. మిగిలింది యుద్ధం." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.