కొలుసు పార్థసారథి
కొలుసు పార్థసారథి | |||
![]()
| |||
శాసనసభ్యుడు, పెనమలూరు శాసనసభ నియోజకవర్గం
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | బోడె ప్రసాద్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2009 – 2014 | |||
తరువాత | బోడె ప్రసాడ్ | ||
శాసనసభ్యుడు, పామర్రు శాసనసభ నియోజకవర్గం
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | చలసాని పాండు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొలుసు పార్థసారథి యాదవ్ కరకంపాడు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1965 ఏప్రిల్ 18||
రాజకీయ పార్టీ | వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ (2014 నుండి) భారత జాతీయ కాంగ్రెస్ (2014 వరకు) | ||
జీవిత భాగస్వామి | కె.కమలా లక్ష్మి | ||
సంతానం | కె. నితిన్ కృష్ణ | ||
నివాసం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు, తెలంగాణ |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొలుసు పార్థసారథి (జ. 1965 ఏప్రిల్ 18) భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు శాసససభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యునిగా ఉన్నాడు. 2004, 2009, 2019 లో మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004 లో మొదటిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు, తరువాత 2009, 2019 లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆయన కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు.[1][2]
వై.ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పనిచేశాడు. రాజశేఖర్ రెడ్డి. పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోర్ట్‌ఫోలియోను కేటాయించాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మాధ్యమిక విద్యకు చివరి మంత్రిగా ఉన్నాడు.
ప్రారంభ జీవితం[మార్చు]
పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కరకంపాడు గ్రామంలో రాజకీయ నేపథ్యంగల కుటుంబంలోజన్మించాడు. అతని తండ్రి కొలుసు పెద్దారెడ్డయ్య యాదవ్ రాజకీయ నాయకుడు, మచిలీపట్లం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1991, 1996 లలో ఎన్నికయ్యాడు.[3] అతని తల్లి గృహిణి.
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ "Machilipatnam (Andhra Pradesh) Lok Sabha Election Results 2019 - Parliamentary Constituency". www.elections.in.