కొలుసు పెద రెడ్డయ్య యాదవ్
కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ | |||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | కావూరి సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | కైకాల సత్యనారాయణ | ||
నియోజకవర్గం | మచిలీపట్నం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 – 1985 | |||
ముందు | వడ్డే శోభనాద్రీశ్వరరావు | ||
తరువాత | అన్నే బాబు రావు | ||
నియోజకవర్గం | ఉయ్యూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1942 కరకంపాడు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 13 జనవరి 2023 విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | సుబ్బయ్య, సరస్వతి | ||
జీవిత భాగస్వామి | సామ్రాజ్యం | ||
సంతానం | కొలుసు పార్థసారథి, సురేష్ బాబు, కృష్ణకాంత్ | ||
నివాసం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం |
కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మచిలీపట్నం ఎంపీగా, ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి.
జననం
[మార్చు]కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, కరకంపాడు గ్రామంలో 1942న సుబ్బయ్య, సరస్వతి దంపతులకు జన్మించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ 1983లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కాకాని రామ్మోహన్ రావుపై 3092 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
కె.పి రెడ్డయ్య ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివ రావుపై 27322 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి 1996లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కైకాల సత్యనారాయణ చేతిలో పోటీ చేసి 81507 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
కె.పి రెడ్డయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఏలూరు నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.
మరణం
[మార్చు]కేపీ రెడ్డయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 13 జనవరి 2023న ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (14 January 2023). "మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య మృతి". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
- ↑ EENADU (14 January 2023). "మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కన్నుమూత". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.