వడ్డే శోభనాద్రీశ్వరరావు
స్వరూపం
వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.. మైలవరం శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. వ్యవసాయ మంత్రి . అమరావతి రాజధాని ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు చాలని, విశాఖ రైల్వే జోన్ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దని, వాదించారు.
జీవిత విశేషాలు
[మార్చు]వడ్డే శోభనాద్రీశ్వర రావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1943 అక్టోబరు 21న జన్మించాడు. బి.ఎస్. సి., బి. ఇ (మెకానికల్) వరకు విద్యనభసించాడు. 1962 లో వి.బి.రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]- 1972 లో ఉయ్యురు శాసనసభ నియోజకవర్గం నుండి కాకాని వెంకటరత్నం పై శాసనసభకు పోటీ[1]
- 1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ
- 1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక[1]
- 1984-89 విజయవాడ 8వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [2]
- 1991-96 విజయవాడ 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [3]
- 1997-99 న్యూఢిల్లీలో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
- 1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి[3]
- 2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్ఛంద విరమణ
పుస్తక ప్రచురణలు
[మార్చు]- సాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్
- అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాండిడేట్ అనువాదం )
- గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం )
బాహ్య లంకెలు
[మార్చు]- https://vaddesobhanadri.com/
- Ex Minister Vadde Sobhanadreeswara Rao Interview || Vintage Talk With Vikram Poola #31, retrieved 2022-11-11
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Vuyyur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-11-11.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.
- ↑ 3.0 3.1 "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.