తోట నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట నరసింహం

లోక్ సభ సభ్యులు
తెలుగుదేశం లోక్‌సభా పక్ష నేత
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 June 2014
ముందు మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు
నియోజకవర్గం కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-02) 1961 జూన్ 2 (వయసు 62)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
[[జూన్ 5]], 2014నాటికి

తోట నరసింహం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు[1]. ఈ ఎన్నికలో అతను సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందాడు.[2][3] ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ లోక్ సభ నేతగా ఉన్నారు.

వ్యక్త్రిగత జీవితం[మార్చు]

అతను 1962 జూన్ 6 న తోట వరహాలయ్య, పద్మాక్షమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బి.కామ్ వరకు చదివాడు.[4] అతనికి 1986 నవంబరు 25 న తోట సరస్వతి (వాణి) తో వివాహమైంది. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[5]

రాజకీయ జీవితం[మార్చు]

తోట నరసింహం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికైనాడు. మొదట 2004-2006లో, రెండవసారి 2009-2014 లో ఎన్నికైనాడు. అతను 2010 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. అతను 2014లో 16వ లోక్ సభకు ఎన్నికైనాడు అతను లోక్ సభలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, రైల్వేల స్టాండింగ్ కమిటీలకు సభ్యునిగానూ, జనరల్ పర్పస్ కమీటీకి కూడా సభ్యునిగా ఉన్నాడు. అతను పెట్రోలియం సహజ వాయువుల శాఖకు మంత్రిగా ఉన్నాడు. అతను తెలుగు దేశం లోక్ సభాపక్ష నేతగా కూడా వ్యవహరించాడు[5]

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
  2. "Pallam Raju, Harsha Kumar lose elections". The Hindu (in Indian English). 2014-05-16. ISSN 0971-751X. Retrieved 2016-03-04.
  3. "Y.S. Choudary is TDP Parliamentary Party leader". The Hindu (in Indian English). 2014-06-05. ISSN 0971-751X. Retrieved 2016-03-04.
  4. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  5. 5.0 5.1 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-04.
Party political offices
అంతకు ముందువారు
నామా నాగేశ్వరరావు
Leader of the Telugu Desam Party in the 16th Lok Sabha
2014–present
Incumbent