నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు నల్లమిల్లి శేషారెడ్డి
తరువాత సత్తి సూర్యనారాయణ రెడ్డి
నియోజకవర్గం అనపర్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1958
రామవరం, అనపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నల్లమిల్లి మూలారెడ్డి, సత్యవతి
జీవిత భాగస్వామి మహాలక్ష్మి

నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా పనిచేశాడు. [1] నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు. ఏబీఎన్ ఛానల్ సర్వేలో 175 మంది ఎమ్మెల్యేలలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదటి స్థానంలో నిలిచారు.

రాజకీయ జీవితం

[మార్చు]

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి అడుగుజాడల్లో తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పని చేసి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై 1513 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతిలో 55207 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా శివరామకృంరాజును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2024 ఏప్రిల్ 24న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సిద్దార్థనాథ్‌ సింగ్‌, అరుణ్‌సింగ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] అయితే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు కుదరకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించి ఆయనకు పార్టీ బీఫామ్ అందజేశారు.

తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, వారితో నేరుగా మమేకం అవ్వడానికి మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టిన కార్యక్రమం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స్ఫూర్తినిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు ‌ 2014 నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గాన్ని 5 వేలకోట్లతో అభివృద్ధి చేశారు, 2018 నుంచి 2019 వరకు మరో 1.50 వేల కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేశారు.[వివరణ అవసరం]

మూలాలు

[మార్చు]
  1. "FOURTEENTH ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY Constituted on 20.05.2014". Legislative Assembly of Andhra Pradesh. Archived from the original on 6 July 2015. Retrieved 10 August 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Andhrajyothy (23 April 2024). "బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.