గిడ్డి సత్యనారాయణ
గిడ్డి సత్యనారాయణ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | కొండేటి చిట్టిబాబు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పి.గన్నవరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1982 ఉడిమూడిలంక, పి.గన్నవరం మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ |
గిడ్డి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ , పోలీస్ అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పి.గన్నవరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]గిడ్డి సత్యనారాయణ 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, ఉడిమూడిలంక గ్రామంలో జన్మించాడు. ఆయన బీఏ, బీఎల్ పూర్తి చేశాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]గిడ్డి సత్యనారాయణ హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో 20 ఏళ్లు అక్కౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో జనవరి 2024లో జనసేన పార్టీలో చేరి[4], 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పి.గన్నవరం నుండి కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావుపై 33367 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Andhrajyothy (24 March 2024). "అంతా ఓకే!". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.
- ↑ Andhrajyothy (6 February 2024). "పి.గన్నవరం జనసేన ఇన్‌చార్జిగా గిడ్డి సత్యనారాయణ". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.