కొండేటి చిట్టిబాబు
కొండేటి చిట్టిబాబు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | పి.గన్నవరం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 ఏప్రిల్ 1963 నగరం గ్రామం, మామిడికుదురు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | నాగేశ్వరరావు | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | వికాస్‌బాబు, స్టాలిన్‌బాబు, దేవీప్రియాంక |
చిట్టిబాబు కొండేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం[మార్చు]
కొండేటి చిట్టిబాబు 1 ఏప్రిల్ 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, నగరం గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంఏ వరకు చదువుకున్నాడు.[2]
రాజకీయ జీవితం[మార్చు]
కొండేటి చిట్టిబాబు విద్యార్థి దశ నుండే కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై 22207 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ TV9 Telugu (23 May 2019). "ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
- ↑ Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.