కామినేని శ్రీనివాసరావు
Appearance
కామినేని శ్రీనివాసరావు (జననం: మే 7, 1947) 2014 సార్వత్రిక ఎన్నికలలో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికై నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో ఆరోగ్య శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖల మంత్రిగా పని చేశాడు..[1] 1980 దశకంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కామినేని తదనంతరం పార్టీకి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఇతని స్వగ్రామం కైకలూరు మండలం వరహాపట్నం. ఇతని వయస్సు 67 సంవత్సరాలు. ఇతను ఎంబిబియస్ చదివాడు. ఇతనికి భార్య (విజయ సింహ), ముగ్గురు కుమారులు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
సాక్షి దినపత్రిక - 9-6-2014