కొల్లు రవీంద్ర
కొల్లు రవీంద్ర | |
---|---|
![]() | |
శాసనసభ్యులు, మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ | |
In office 2014–2019 | |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం |
కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
కొల్లు రవీంద్ర గారి జన్మస్థలము కృష్ణా జిల్లా, మచిలీపట్టణంలో జన్మించారు. వీరు అగ్నికులక్షత్రియులు సామాజికవర్గానికి చెందినవారు, రఘుకుల గోత్రిజ్ఞులు.
రాజకీయ జీవితం[మార్చు]
కొల్లు రవీంద్ర 1998 లో మచిలిపట్నంలో తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదవిలో అతను పదేళ్లపాటు ఉన్నాడు. మే 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మచిలిపట్నం నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరపున టికెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికలలో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకటరామయ్య చేతిలో 9300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఐదేళ్ళ తరువాత 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రత్యర్థి పెర్ని వెంకటరామయ్యను 15,800 ఓట్ల తేడాతో ఓడించాడు.[1] అతను చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేనేత వస్త్రాలు & ఎక్సైజ్, బిసి సంక్షేమం, సాధికారత అనే రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. . ఏప్రిల్ 2017 లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత, లా అండ్ జస్టిస్, స్కిల్ డెవలప్మెంట్, యూత్, స్పోర్ట్స్, నిరుద్యోగ ప్రయోజనాలు, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల మంత్రిగా నియమితుడయ్యాడు[2].[3] [4]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెర్ని వెంకటరామయ్య (నాని) చేతిలో ఓడిపోయాడు. [5]
స్వచ్ఛంద సంస్థ[మార్చు]
మార్చి 2015 లో, కొల్లు రవీంద్ర మచిలిపట్నంలో పేద ప్రజల విద్య కోసం అంకితం చేసిన స్పార్షా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.[ఆధారం చూపాలి]
మూలాలు[మార్చు]
- ↑ "Sitting and previous MLAs from Machilipatnam Assembly Constituency". elections.in. Archived from the original on 1 ఏప్రిల్ 2017. Retrieved 1 April 2017.
- ↑ "Portfolios allocated to new AP ministers; Lokesh gets IT and". Outlook. 3 April 2017. Archived from the original on 8 ఏప్రిల్ 2017. Retrieved 8 April 2017.
- ↑ "Council of Ministers". AP State Portal. Archived from the original on 10 జూన్ 2018. Retrieved 8 April 2017.
- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-06-11.
- Pages using infobox officeholder with unknown parameters
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from April 2017
- కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- కృష్ణా జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2014)
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు