Jump to content

బెందుల తిరుమల నాయుడు

వికీపీడియా నుండి


బి.టి.నాయుడు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2019 మార్చి 30 – 2025 మార్చి 29
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1973-05-28) 1973 మే 28 (వయసు 51)
జుమలదిన్నె, కోసిగి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బుడ్డన్న, అయ్యమ్మ
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం వవళిక

బెందుల తిరుమల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బి.టి.నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కోసిగి మండలం, జుమలదిన్నె గ్రామంలో బుడ్డన్న, అయ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి పన్నెండేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బి.టి.నాయుడు 1994లో టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి 1996లో టీడీపీ ఆదోని నియోజకవర్గ లీగల్‌సెల్‌ అధ్యక్షుడిగా ఎన్నికై, ఆతర్వాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశాడు. ఆయన కడప, అనంతపురం పార్లమెంట్ లోక్‌సభ నియోజవర్గాలకు ఇన్‌చార్జిగా పనిచేశాడు. బీటీ నాయుడు 2009 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో రెండోసారి కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] బి.టి.నాయుడు 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ తరపున శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (1 March 2019). "అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  2. Andhra Jyothy (1 May 2019). "ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటీ." Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.