పాకలపాటి రఘువర్మ
| పాకలపాటి రఘువర్మ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 30 మార్చి 2019 - 29 మార్చి 2025 | |||
| ముందు | గాదె శ్రీనివాసులు నాయుడు | ||
|---|---|---|---|
| తరువాత | గాదె శ్రీనివాసులు నాయుడు | ||
| నియోజకవర్గం | శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 16 అక్టోబరు 1962 విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | ఇండిపెండెంట్ | ||
| తల్లిదండ్రులు | రఘునాధ రాజు,పార్వతమ్మ | ||
| జీవిత భాగస్వామి | అవివాహితుడు | ||
| నివాసం | రాజులవీధి, భోగాపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
పాకలపాటి రఘువర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు & శాసనమండలి సభ్యుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]పాకలపాటి రఘువర్మ మార్చి22న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్ (257) సంఘం, యూటీఎఫ్, మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ సంఘాలు, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి బలపర్చిన గాదె శ్రీనివాసులు నాయుడుపై 8372 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఏప్రిల్ 2న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]
ఆయన 2025లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఏపీటీఎఫ్ అభ్యర్థిగా టిడిపి, జనసేన మద్దతుతో[4] ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[5] ఈ స్థానానికి 20,791 ఓట్లు పోలవ్వగా, 656 ఓట్లు చెల్లలేదు. పది మంది పోటీలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లు పిఆర్‌టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడుకు 7,272, టిడిపి, జనసేన మద్దతునిచ్చిన ఎపిటిఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,905, యుటిఎఫ్ మద్దతిచ్చిన పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,900 వచ్చాయి. రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ రౌండ్‌కు వెళ్లారు. 9వ రౌండ్ (ఆఖరి రౌండ్)లో గాదె శ్రీనివాసులనాయుడుకు 9,237, పాకలపాటి రఘువర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ప్లస్ 1 (10,068) ఓట్లు రాకపోవడంతో 710 ఓట్లతో గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (27 March 2019). "Raghu Varma elected MLC". The Hindu (in Indian English). Archived from the original on 27 March 2019. Retrieved 20 June 2021.
- ↑ Mar 27, The Times of India (27 March 2019). "APTF candidate wins MLC election for north Andhra teachers' seat". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (27 March 2019). "విజేత.. వర్మ". Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ "ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కి టిడిపి, జనసేన మద్దతు". Prajasakti. 19 February 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "NDA announces support to Uttarandhra Teachers MLC candidate Pakalapati Raghu Varma" (in Indian English). The Hindu. 20 February 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం..!". Telugu Prabha. 3 March 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "ఆంధ్రప్రదేశ్‌లో కూటమికే జేజేలు!". Andhrajyothy. 4 March 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.