తూమాటి మాధవరావు
'
తూమాటి మాధవరావు | |||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 28 జూన్ 1977 పోలినేనిపాలెం గ్రామం, వలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | వెంకటశిరీష | ||
సంతానం | 2 |
తూమాటి మాధవరావు' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తూమాటి మాధవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, వలేటివారిపాలెం మండలం, పోలినేనిపాలెం గ్రామంలో 1977 జూన్ 28లో జన్మించాడు. ఆయన ఎంఏ పోలిటికల్ సైన్స్ వరకు చదివాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]తూమాటి మాధవరావు 1996 నుంచి 2000 వరకూ వార్త దినపత్రికలో పనిచేశాడు.ఆయన 2005లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2009లో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నియమితుడై, టిడిపిలో క్రియాశీలకంగా పనిచేసి 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి కందుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశాడు. ఆయన వై.యస్. రాజశేఖరరెడ్డి మరణం తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.
తూమాటి మాధవరావు 2014 అస్లెంబీ కందుకూరు నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించాడు, కానీ టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోతుల రామారావు గెలుపులో కీలకంగా పనిచేశాడు. పోతుల రామారావు 2016లో టిడిపిలో చేరడంతో ఆయన మళ్లీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. మాధవరావు 2019 వైసిపి టిక్కెట్ కోసం ఆశించినా దక్కలేదు, ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్ రెడ్డి గెలుపులో కీలకంగా పనిచేశాడు.[3]
తూమాటి మాధవరావుకు 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2021 నవంబరు 13న పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ కేటాయించింది.[4] ఆయన స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2021 నవంబరు 23న నామినేషన్ దాఖలు చేశారు.[5] ఆ స్థానికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2021 డిసెంబరు 8న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (26 November 2021). "ఎమ్మెల్సీగా తూమాటి ఏకగ్రీవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Prajasakti (7 December 2021). "వ్యవసాయ కుటుంబం నుంచి ఎమ్మెల్సీగా... | Prajasakti". Archived from the original on 7 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Eenadu (13 November 2021). "వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాధవరావు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Andhrajyothy (23 November 2021). "అట్టహాసంగా 'తూమాటి' నామినేషన్". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.