Jump to content

టి.కల్పలత

వికీపీడియా నుండి
తమాటం కల్పలతా రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2021 - 29 మార్చి 2027
నియోజకవర్గం గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 జనవరి 1978
నంగివాండ్లపల్లి, తలుపుల మండలం, కదిరి నియోజకవర్గం అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ YSRCP
తల్లిదండ్రులు టి. కులశేఖర రెడ్డి, సత్యవతి
జీవిత భాగస్వామి బి. ప్రతాప్ రెడ్డి

టి. కల్పలతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తుంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

టి. కల్పలత రెడ్డి 2021లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు పోగా అభ్యర్థి విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కల్పలతకు 3870 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు 2831 ఓట్లు, ఎ. ఎస్. రామకృష్ణకు 1958 ఓట్లు, ఏపీటీఎఫ్ అభ్యర్థి పి. పాండురంగ వరప్రసాదరావుకు 1490, స్వతంత్ర అభ్యర్థి చందు రామారావుకు 1,063, ఎస్టీయూ అభ్యర్థి పి.వి.మల్లిఖార్జునరావుకు 459, జనసేన మద్దతుతో పోటీ చేసిన గాదె వెంకటేశ్వరరావుకు 231 ఓట్లు వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగింది. కల్పలత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6 వేల 153 ఓట్లు దాటగానే విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో తన సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఎమ్మెల్సీగా గెలిచింది.[2][3][4] టి.కల్పలత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా 2021 ఏప్రిల్ 7న ప్రమాణ స్వీకారం చేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (18 March 2021). "టీచరు ఎమ్మెల్సీ విజేతలు సాబ్జీ, కల్పలత". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  2. Sakshi (18 March 2021). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  3. HMTV (18 March 2021). "గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  4. Prajasakti (18 March 2021). "ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  5. The Hans India (7 April 2021). "T Kalpalata takes oath as MLC" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=టి.కల్పలత&oldid=4357710" నుండి వెలికితీశారు