కుంభా రవిబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంభా రవిబాబు

పదవీ కాలం
11 ఆగష్టు 2023 – 09 ఆగష్టు 2029
నియోజకవర్గం గవర్నర్ కోటా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 2009
ముందు శోభా హైమావతి
తరువాత కోళ్ల లలిత కుమారి

వ్యక్తిగత వివరాలు

జననం 1959
అరకులోయ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కోటయ్య
వృత్తి రాజకీయ నాయకుడు

కుంభా రవిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ జాతుల కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కుంభా రవిబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి శోభా హైమావతి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, తరువాత 2014లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పార్టీ టికెట్ ఆశించాడు, కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన అరకులోయ నియోజకవర్గం నుండి టీడీపీ రెబెల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[3] 5 మార్చి 2021న ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ జాతుల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా నియమితుడై మార్చి 27న భాద్యతలు చేపట్టాడు.[4]

ఆయనను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా, ఆగష్టు 09న ఎమ్మెల్సీ నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (5 March 2021). "ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కుంభా రవిబాబు". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  2. The Hindu (21 May 2016). "Rebel trouble still haunts TDP" (in Indian English). Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  3. Sakshi (9 January 2018). "వైఎస్సార్‌సీపీలోకి కుంభా రవిబాబు". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  4. ETV Bharat News (27 March 2021). "ఎస్టీ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ కుంభా రవిబాబు బాధ్యతల స్వీకరణ". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  5. Andhrajyothy (11 August 2023). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.