Jump to content

శోభా హైమావతి

వికీపీడియా నుండి
శోభా హైమావతి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
నియోజకవర్గం శృంగవరపుకోట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
శృంగవరపుకోట, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
సంతానం స్వాతి రాణి

శోభా హైమావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1999లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం

[మార్చు]

శోభా హైమావతి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసింది. ఆమె 1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగాధరస్వామి శెట్టి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభ రవిబాబు చేతిలో ఓడిపోయింది.

శోభా హైమావతి 2011లో తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలిగా నియమితురాలైంది. ఆమె 2021లో పార్టీలో తనకు జరిగిన వివిధ పరిణామాల కారణంగా జులై 2021లో టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది.[1] ఆమె తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 27 జనవరి 2022న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[2]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (17 July 2021). "తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి గుడ్‌బై". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prabha News (28 January 2022). "టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన శోభా హైమావతి". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.