రాజగొల్ల రమేశ్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజగొల్ల రమేశ్‌ యాదవ్‌

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 జూన్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్ కోట ఎమ్మెల్సీ

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూన్ 1982
పొద్దటూరు, కడప జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఆర్. వెంకటసుబ్బయ్య, రాములమ్మ
జీవిత భాగస్వామి నేహా [1]
సంతానం రాణేష్, శీయానా
నివాసం పొద్దటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజగొల్ల రమేశ్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు.[2][3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

రమేశ్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, పొద్దటూరు లో ఆర్‌.వెంకటసుబ్బయ్య, రాములమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. అతని తండ్రి వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరు పురపాలక సంఘం చైర్మన్ గా పనిచేసాడు. రమేష్ యాదవ్ అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్స్ సంస్థకు సి.ఇ.ఓ గా ఉన్నాడు. అబాకస్ ఓవర్సీస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని 200 కి పైగా విశ్వవిద్యాలయాలతో, కెనడాలోని 70 విశ్వవిద్యాలయాలు / కళాశాలలతో సంబంధాలు కలిగి ఉంది. [5] అతను ఆర్.వి.యస్ యువశక్తి సోషన్ సపోర్ట్ వ్యవస్థాపకుడు.

రాజకీయ జీవితం[మార్చు]

రమేశ్‌ యాదవ్‌ 2013లో అబాకస్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. ఆయన ఆర్‌.వి.ఎస్ యువ శక్తి సోషల్ సపోర్ట్ అసోసియేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 11వ వార్డు కౌన్సిలర్‌ గా గెలిచాడు.రమేశ్‌ యాదవ్‌ 14 జూన్ 2021న గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[6][7] ఆయన 21 జూన్ 2021న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Eenadu (15 June 2021). "కలలో కూడా ఊహించలేదు". EENADU. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  2. TV9 Telugu (14 June 2021). "AP Governor Quota MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం.. ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్ - AP governor approves nominated governor quota mlc four names". TV9 Telugu. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.
  3. Andhrajyothy (15 June 2021). "ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  4. Jonathan, P. Samuel (2021-06-14). "Governor clears four names for MLC posts". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-15.
  5. "Abacus Overseas Education Advisors: Optimizing The International Study Options | TheHigherEducationReview". www.thehighereducationreview.com. Retrieved 2021-06-16.
  6. Sakshi (15 June 2021). "కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం". Sakshi. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.
  7. Sakshi (16 June 2021). "కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ". Archived from the original on 17 జనవరి 2022. Retrieved 17 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  8. Sakshi (21 June 2021). "ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు". Sakshi. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.

బాహ్య లంకెలు[మార్చు]