మురుగుడు హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురుగుడు హనుమంతరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2009
ముందు నిమ్మగడ్డ రామ మోహన్ రావు
తరువాత కాండ్రు కమల
నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 మార్చి1947
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మాణిక్యం, చినవీరరాఘవులు
జీవిత భాగస్వామి సామ్రాజ్యం
సంతానం అరుణకుమారి, మధుసూదనరావు, సత్యం

మురుగుడు హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

జననం

[మార్చు]

మురుగుడు హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరిలో 1947 మార్చి 15లో మాణిక్యం, చినవీరరాఘవులు దంపతులకు జన్మించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మురుగుడు హనుమంతరావు 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మంగళగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 1987 నుంచి 1992 వరకు మంగళగిరి మునిసిపల్‌ చైర్మన్‌గా పనిచేశాడు. అయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు పై 12024 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. హనుమంతరావు 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభా కమిటీ చైర్మన్‌గా, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.[2]

మురుగుడు హనుమంతరావుకు 2009లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కలేదు. ఆయన రాష్ట్ర విభజన అనంతరం 2013లో తెలుగుదేశం పార్టీలో చేరి 2013 నుంచి 2015 వరకు ఆప్కో చైర్మన్‌గా పనిచేశాడు. హనుమంతరావు 2021 సెప్టెంబరు 23న టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు.[3][4] మురుగుడు హనుమంతరావు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2021లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 2021 డిసెంబరు 8న ప్రమాణ స్వీకారం చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Mangalagiri (2021). "Members of Legislative Assembly - Mangalagiri". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  3. Andhrajyothy (23 September 2021). "టీడీపీకి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు రాజీనామా". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  4. Eenadu (23 September 2021). "తెదేపాకు మాజీ మంత్రి రాజీనామా". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  5. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.