పిడుగు హరిప్రసాద్
పిడుగు హరిప్రసాద్ | |||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జులై 5 - 2027 మార్చి 29 | |||
ముందు | మహమ్మద్ ఇక్బాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
నివాసం | ఏలూరు |
పిడుగు హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు. ఆయనను 2024 జులై 12న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా జులై 1న పార్టీ అధిష్టానం ప్రకటించింది.[1]
వృత్తి జీవితం
[మార్చు]హరిప్రసాద్ జర్నలిస్ట్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఈనాడు, ఈటీవీ-2లో పని చేసి ఆ తరువాత మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేసి ఆ తరువాత అదే ఛానల్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన ఆ తరువాత సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హరిప్రసాద్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం అధిపతిగా,[2] పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా 2024 జులై 12న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా జులై 1న పార్టీ అధిష్టానం ప్రకటించింది.[3] ఈ ఎన్నికలలో ప్రత్యర్థులుగా ఎవరు పోటీలో లేకపోవడండతో ఆయన కౌన్సిల్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[4] పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన తొలి ఎమ్మెల్సీగా రికార్డులకు ఎక్కాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే, జనసేనకు ఛాన్స్". 1 July 2024. Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
- ↑ The Hindu (7 October 2017). "No room for tainted persons, says JSP" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ Eenadu (2 July 2024). "ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ "ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం". 5 July 2024. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.