Jump to content

జయమంగళ వెంకటరమణ

వికీపీడియా నుండి
జయమంగళ వెంకటరమణ
జయమంగళ వెంకటరమణ


ఎమ్మెల్సీ
పదవీ కాలం
మార్చి 2023 – మార్చి 2029
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు యెర్నేని రాజా రామచందర్
తరువాత కామినేని శ్రీనివాస్
నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
కొట్టాడ, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బ్రహ్మయ్య, తాయారమ్మ.
జీవిత భాగస్వామి సుజాత
సంతానం పూజిత, రమ్య, తేజ
మూలం [1]

జయమంగళ వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో కైకలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పని చేసి 2005లో కైకలూరు జడ్పీటిసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] వెంకటరమణ 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ దక్కలేదు, ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.

ఆయన 2019 నుండి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేస్తూ ఎంఎల్‌సి ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 17న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4] ఆయన మార్చి 2023లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5] ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి 2024 నవంబర్ 23న రాజీనామా చేశాడు.[6]

వివాహం

[మార్చు]

జయ మంగళ వెంకటరమణకు మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది, అప్పటికి వారికీ ఓ కుమార్తె ఉంది. ఆయన ఆ తర్వాత సునీతను వివాహమాడగా వారికీ ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. సునీతతో కుటుంబ వివాదాలు తలెత్తడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వెంకటరమణ 2023 నవంబర్ 27న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "జయమంగళ వెంకటరమణ" (PDF). 2023. Archived from the original (PDF) on 27 November 2023. Retrieved 27 November 2023.
  2. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (17 February 2023). "TDP former MLA Jayamangala Venkataramana joins YSR Congress Party" (in Indian English). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  4. Eenadu (17 February 2023). "వైకాపాలో చేరిన జయమంగళ వెంకటరమణ". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  5. Prajasakti (23 March 2023). "ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిగా జయమంగళ" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  6. "వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !". 23 November 2024. Retrieved 23 November 2024.
  7. A. B. P. Desam (27 November 2023). "మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ - సాక్షి సంతకం చేసిన రెండో భార్య !". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  8. Eenadu (27 November 2023). "వైకాపా ఎమ్మెల్సీ మూడో పెళ్లికి.. రెండో భార్య సాక్షి సంతకం". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.